English | Telugu

మెగా హీరో సుప్రీం రన్ టైం లాక్ అయింది..!

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, సుప్రీం ఫైనల్ ప్రొడక్ట్ ను రెడీ చేసే పనిలో పడ్డారు దిల్ రాజు అండ్ కో. ఇప్పటికే ప్రమోషన్లు జోరందుకున్నాయి. సెన్సార్ కార్యక్రమాల్ని కూడా పూర్తిచేసుకున్న సుప్రీం రన్ టైం ను లాక్ చేసేశారు. 142 నిముషాల రన్ టైంతో సుప్రీం హీరో థియేటర్లలో ఎంటరౌతున్నాడు. మూవీ టీం కూడా వరస ప్రమోషన్లతో హీటెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సుప్రీంలో సాయి ధరమ్ ట్యాక్సీ డ్రైవర్ గా కనిపిస్తే, హీరోయిన్ రాశీఖన్నా పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరవనుంది. కళ్యాణ్ రామ్ తో పటాస్ లాంటి ఎంటర్ టైనర్ ను తెరకెక్కించి హిట్ కొట్టిన అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటం, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటంతో ఇప్పటికే సుప్రీంకు అన్నివైపులా పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. చిరు అలనాటి పాట అందం హిందోళం సాంగ్ ను సుప్రీంలో రీమిక్స్ చేయడం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.