English | Telugu
'ఆగడు'లో నాగార్జున కామెడి..!
Updated : Sep 4, 2014
దూకుడు సినిమాలో నాగార్జున గారి పేరును వాడుకొని బ్రహ్మానందంతో మహేష్ ఆడుకున్న సన్నివేశాలు ఎవరైన మరిచిపోతారా? నాగార్జున గారి రియాల్టీ షో అని బ్రాహ్మీని వాడుకున్న తీరును అటు మహేష్ అభిమానులు, నాగార్జున అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆగడు కోసం మరోసారి నాగార్జున గారి పేరును శ్రీనువైట్ల వాడినట్లు సమాచారం. బుల్లితెరపై సూపర్ హిట్ షోగా పేరుతెచ్చుకున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పై ఆగడులో బ్రహ్మానందాన్ని పెట్టి ఓ స్పూఫ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పూఫ్ సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి ఈ స్పూఫ్ మనం కూడా చూసి ఎంజాయ్ చేయాలంటే 19వరకు ఆగాల్సిందే.