English | Telugu
'రభస' కలేక్షన్లు నిరసించాయి..!
Updated : Sep 4, 2014
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రభస' కలేక్షన్లు రోజురోజుకి నిరసించిపోతున్నాయి. ఎన్టీఆర్ కలలుకంటున్న 50 కోట్ల కలెక్షన్లు ఈ సినిమాతో సాధ్యంకాదని ట్రేడ్ వర్గాలు ఫిక్సయిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమాని సేఫ్ జోన్ లో తీసుకురావడానికి నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తొలి షో నుంచే నెగిటివ్ టాక్ మూటగట్టుకున్న 'రభస'..తొలిరోజు వసూళ్ళు బాగానే వచ్చినప్పటికీ ఆతరువాత వసూళ్ళు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు రవితేజ పవర్ వాయిదా పడడంతో 'రభస’ సేఫ్ జోన్ లోకి వస్తుందెమోనని బయ్యర్లు ఊపిరిపీల్చుకుంటున్నారు. మరి రభస 30 కోట్ల మార్క్‌ని అందుకుంటుందేమో చూడాలి.