English | Telugu

సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్రి మృతి: చిత్ర‌సీమ దిగ్భ్రాంతి

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్రి (40) ఈరోజు ఉద‌యం హైద‌రాబాద్‌లో గుండెపోటుతో మ‌ర‌ణించారు. దాదాపు 90 చిత్రాల‌కు సంగీతం అందించారు. ఆయ‌న తొలి చిత్రం బాచి. ఎర్ర‌బ‌స్సుకీ ఆయ‌న స్వరాలు స‌మ‌కూర్చారు. చ‌క్రి మ‌ర‌ణ‌వార్త విన‌గానే చిత్ర‌లోకమంతా షాక్‌కి గురైంది. ఆదివారం అర్థరాత్రి వ‌ర‌కూ ఆయ‌న రికార్డింగ్‌ప‌నుల‌తో బిజీగా గ‌డిపారు. తెల్ల‌వారుఝామున గుండెనొప్పితో ఆసుప‌త్రిలో చేరారు. అప్ప‌టికే ఆయ‌న మ‌ర‌ణించారు. హుషారుపాట‌ల‌కే కాదు, మెలొడీ గీతాల‌కూ చ‌క్రి ప్ర‌సిద్ది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఎన్నో హిట్ చిత్రాల‌కు బాణీలు అందించారు. ఇడియ‌ట్‌, ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం, ఔను వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు, స‌త్యం, ఢీ, మ‌స్కా, దేవ‌దాసు... ఇలా ఎన్నో హిట్ చిత్రాలు ఆయ‌న ఖాతాలో ఉన్నాయి. సింహా చిత్రానికి ఆయ‌న నంది అవార్డు అందుకొన్నారు. చ‌క్రి మృతి ప‌ట్ల‌.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఇంత చిన్న వ‌య‌సులో తెలంగాణ చిత్ర‌ప‌రిశ్ర‌మ ఓ గొప్ప సంగీత ద‌ర్శ‌కుడ్ని కోల్పోయింద‌న్నారు. చ‌క్రి మ‌ర‌ణ వార్త తెలియగానే సినీ ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖులంతా షాక్ తిన్నారు. చ‌క్రి స్వ‌గృహంలో ఇప్పుడు విషాద ఛాయ‌లు అలుముకొన్నాయి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.