English | Telugu
ప్రభాస్ మిస్టర్ పెర్ ఫెక్ట్ యు.యస్.కలెక్షన్స్
Updated : Apr 25, 2011
ప్రభాస్ "మిస్టర్ పెర్ ఫెక్ట్" యు.యస్.కలెక్షన్స్ బాగున్నాయని తెలిసింది. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప౦తాకంపై, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి పన్ను హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన చిత్రం "మిస్టర్ పెర్ ఫెక్ట్". ఈ చిత్రానికి యువ సంగీతం తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్నందించారు. ప్రభాస్ "మిస్టర్ పెర్ ఫెక్ట్" చిత్రం యు.యస్.లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తుంది.
వివరాల్లోకి వెళితే ప్రభాస్ "మిస్టర్ పెర్ ఫెక్ట్" చిత్రం 27 స్క్రీన్స్ లో వేయగా 2,40,000 డాలర్లు వసూలు చేసిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇది యు.యస్.లో ప్రభాస్ అన్ని సినిమాల్లోకీ అత్యధిక మొత్తంగా అనుకోవచ్చు. ప్రభాస్ "మిస్టర్ పెర్ ఫెక్ట్" సినిమా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మిక్స్ డ్ టాక్ తో నడుస్తున్నా, యు.యస్.లో మాత్రం యునానిమస్ టాక్ తో దిగ్విజయంగా నడుస్తోంది. "బృందావనం, బొమ్మరిల్లు" చిత్రాలకు "సంతోషం" చిత్రం ఫ్లేవర్ కలిపితే ఎలా ఉంటుందో ఈ ప్రభాస్ "మిస్టర్ పెర్ ఫెక్ట్" చిత్రం అలా ఉందని యు.యస్.లోని ప్రవాసాంధ్రులు అంటున్నారు.