English | Telugu

మే 6 న రానున్న నాగచైతన్య 100% లవ్

మే 6 న నాగచైతన్య "100% లవ్" విడుదల కానుంది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, యువ హీరో నాగచైతన్య హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం "100% లవ్". నాగచైతన్య "100% లవ్" చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్నందించారు. నాగచైతన్య "100% లవ్" మూవీ ఆడియో ఇటీవలే విడుదలయ్యింది. ఈ చిత్రం ఆడియోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ముందుగా ఏప్రెల్ 29 వ తేదీన విడుదలవుతుందని వినపడింది.

కానీ అదే రోజున రానా హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు శ్రీనివాస్ నిర్మిస్తున్న "నేను-నారాక్షసి" చిత్రమ కూడా అదే రోజున విడుదలవుతున్నందున, నాగచైతన్య "100% లవ్" సినిమా విడుదలని "మే" ఆరవ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది. ఈ మూవిలో హీరో నాగచైతన్య బాలు అనే పాత్రలో నటిస్తూండగా, తమన్నా మహాలక్ష్మి అనే పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో కలర్స్ స్వాతి ఒక పాట పాడటం విశేషం.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.