English | Telugu

"పృధ్వి ఐ ఎ యస్"ఆడియో రిలీజ్

"పృధ్వి ఐ ఎ యస్"ఆడియో రిలీజ్ జరిగింది. వివరాల్లోకి వెళితే రాజేష్ ఫిల్మ్ పతాకంపై, పునీత్ రాజ్ కుమార్ హీరోగా, పార్వతీ మీనన్ హీరోయిన్ గా, జాకబ్ దర్శకత్వంలో కన్నడంలో నిర్మించిన "పృథ్వి" చిత్రాన్ని తెలుగులో "పృధ్వి ఐ ఎ యస్" పేరుతో అనువదిస్తున్నారు. ఏప్రెల్ 24 వ తేదీ ఆదివారం, హోటల్ మారియట్ లో యువ హీరో తనీష్ చేతుల మీదుగా తొలి సి.డి.ని నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాథ్ అందుకోగా ఈ చిత్రం ఆడియో విడుదల చేయబడింది. ఈ చిత్రం ఆడియో రిలీజ్ కోసం హెచ్.డి.దేవెగౌడ రావలిసింది, కానీ ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారనీ ఆయన సందేశాన్ని తీసుకొచ్చిన దర్శకులు నీలకంఠ తెలిపారు.

ఇది మైనింగ్ మాఫియాని అడ్డుకున్న ఒక ఐ ఎ యస్ ఆఫీసర్ కథనీ శేఖర్ బాబు అన్నారు. ఒక పాట రాయటానికి పిలిచి అన్ని పాటలూ తనతోనే రాయించారని మనోజ్ అన్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల ఫంక్షన్ లో నీలకంఠ, మనోజ్, జాకబ్, శేఖర్ బాబు, తనీష్ ‍, కాశీ విశ్వనాథ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అతిథులంతా ఈ "పృధ్వి ఐ ఎ యస్" చిత్రం డబ్బింగ్ సినిమాలా ఉండదనీ, స్ట్రైట్ మూవీలా ఉండి ప్రేక్షకులను అలరిస్తుందనీ ఈ చిత్రం తెలుగులో కూడా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.