English | Telugu

ప్రభాస్ 'మిస్టర్ పెర్ ఫెక్ట్' ఆడియో రిలీజ్

ప్రభాస్ 'మిస్టర్ పెర్ ఫెక్ట్' ఆడియో రిలీజయ్యింది. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన చిత్రం"మిస్టర్ పెర్ ఫెక్ట్". ఈ ప్రభాస్ 'మిస్టర్ పెర్ ఫెక్ట్' ఆడియో రిలీజ్ హైదరాబాద్ గండి పేటలోని సి బి ఐ టి కాలేజ్ ఆవరణలో, యువ హీరో సిద్ధార్థ చేతుల మీదుగా, తొలి సి.డి.ని ప్రముఖ దర్శకులు వినాయక్ అందుకోగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ప్రభాస్ 'మిస్టర్ పెర్ ఫెక్ట్' ఆడియో రిలీజ్ చేయబడింది.

ప్రభాస్ 'మిస్టర్ పెర్ ఫెక్ట్' ఆడియో రిలీజ్ సందర్భంగా ఈ చిత్రసంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రంలోని పాటలను బాబా సెహేగల్ తో కలసి పాడి అక్కడి శ్రోతలను అలరించారు. చివరిగా ప్రభాస్ ప్రసంగిస్తు "హాయ్.... హా................య్ సిబిఐటి... దేవీశ్రీ ప్రసాద్ కి స్పెషల్ థ్యాంక్స్. మీరు ఆగాలి... రెండు నిమిషాలు మీరు కంట్రోల్ కాకపోతే నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ ప్లీజ్‍....కూల్...ఈ చిత్రంలో నా లుక్ బాగుందా...? ఈ సినిమా కోసమ స్లిమ్ అయ్యాను. హెయిర్ స్టైల్ మార్చాను. ఏదో కొత్తదనం కోసం ట్రై చేశాం. ఇది బాగుందా...?ఈ సినిమా మీకు బాగా నచ్చుతుందనుకుంటున్నా. థాంక్యు" అని తన ప్రసంగాన్ని అర్థంతరంగా ముగించి వెళ్ళిపోయారు.

కారణం అక్కడి విద్యార్థులు అదుపులో లేకపోవటమే. అంతకు ముందు వినాయక్ మాట్లాడుతూ "కంట్రోల్ అవమని చెప్పగానే వింటే వాళ్ళు స్టూడెంట్లెందుకవుతారు..." నవ్వుతూఈ చిత్ర నిర్మాత దిల్ రాజుతో అని, విద్యార్థులతో "మీరు రెండు నిమిషాలు కంట్రోల్ అయితే ప్రభాస్ మాట్లాడతారు. నిజానికి విద్యార్థుల సహనాన్ని పరీక్షించింది ఈ ప్రోగ్రాం యాంకర్లు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం