English | Telugu

తెలంగాణ శకుంతల హఠాన్మరణం బాధాకరం: మోహన్‌బాబు


`
తెలుగు తెరపై టిపికల్‌ తెలంగాణ స్లాంగ్‌తో అదరగొట్టిన నటి తెలంగాణ శకుంతల. విలనిజం, కామెడీ, సెంటిమెంట్‌.. ఇలా ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా ఉన్న నటి ఆమె. అటువంటి మహానటి నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం. నాతోపాటు పలు చిత్రాల్లో నటించిన తెలంగాణ శకుంతల.. మేం రూపొందించిన అన్ని చిత్రాల్లోనూ కీలకపాత్రలు పోషించింది. ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో కూడా తన నటనతో అదరగొట్టింది. స్వతహా స్టేజ్‌ ఆర్టిస్ట్‌ అయిన తెలంగాణ శకుంతల స్వయం శక్తితో నటిగా వెలుగొందిన వైనం ప్రశంసనీయం. తెలుగు చిత్రసీమలో తెలంగాణ శకుంతల స్థానం భర్తీ చేయడం అనితరసాధ్యం!