English | Telugu
ఈయన అందరిలాంటివాడు కాదట !
Updated : Mar 25, 2014
పవన్ కళ్యాణ్, నాగార్జున ఇటీవలే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసి తమ మద్దతు పలికిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే మంచు వారి ఫ్యామిలీ కూడా రాజకీయాల్లోకి రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మోహన్ బాబు, మంచు లక్ష్మీ స్పందించారు. మేము రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్లుగా కొన్ని ఊహాగానాలు వినిపించాయి. నేను అందరిలాంటి వాడిని కాను అని మోహన్ బాబు అన్నారు. మంచు లక్ష్మి కూడా.. నరేంద్ర మోడీ అంటే తనకు ఇష్టమని కానీ, ఈ ఎన్నికలలో నేనేమి పోటీ చెయ్యట్లేదు. కానీ నా మద్దతు ఆయనకే అని తెలిపింది. సినిమారంగం నుండి మొదటిసారిగా ఆయనని కలిసింది మా కుటుంబమేనని చెప్పుకొచ్చింది.