English | Telugu
మరో రెండు రోజుల్లో పవన్ ప్రభంజనం
Updated : Mar 25, 2014
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రకటించిన రోజున ఆయన ప్రసంగం దాదాపు దేశం మొత్తం ఆలోచనలో పడింది. అయితే పవన్ పార్టీ పెట్టిన తర్వాత ఏం చేయబోతున్నాడు? అసలు అతని పార్టీ ఎజండా ఏంటి? ఆయన ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మార్చి 27న తెలియనుంది.
ఇందిరా ప్రియదర్శిని స్టేడియం,విశాఖపట్నం. మార్చి 27, 2014న సాయంత్రం 4 గంటలకు పవన్ మరోసారి ప్రజల ముందుకు రాబోతున్నాడు. "రండి తరలి రండి.. ప్రశ్నించడం కోసం" అనే నినాదంతో పవన్ ఈ ప్రసంగంలో పాల్గొనబోతున్నాడు. ఈ ప్రసంగానికి సంబంధించిన పోస్టర్లను ఇటీవలే విడుదల చేసారు. "YOUTH OF THE NATION...Fight for the Nation" అని తెలుపుతూ ప్రజల ముందుకు రాబోతున్నాడు.
మొదటి ప్రసంగంతోనే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా ప్రజలందరిని ఆలోచించే విధంగా చేసిన పవన్... ఈసారి ఎలాంటి ప్రసంగంతో రాబోతున్నాడు అనే ఉత్కంట అందరిలో మొదలైంది. ఈ కార్యక్రమానికి కొన్ని వేల మంది హాజరుకానున్నారు. ఇప్పటికే పోలీసులు విశాఖలో భారీ బందోబస్తును మోహరించారు.
ఈ వేదికపై పవన్ తను రాసిన "ఐఎస్ఎం" ఈ పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. ఈ పుస్తకాన్ని ప్రగతి పబ్లికేషన్ హౌస్ ప్రచురించారు. "జనసేన" పార్టీ ఆవిర్భావం కోసం తనకు అండగా ఉన్నాడని పవన్ చెప్పిన రాజు రవితేజ ఈ పుస్తకంలో భాగస్వామి అయ్యాడు. ఈ వేదికపై రాజు రవితేజ కూడా హాజరుకానున్నాడు. ఈ పుస్తకానికి "Ideology of Jana Sena Party" అనే ఉపశీర్షిక పెట్టారు.