English | Telugu

ట్విట్టర్లో అడుగు పెట్టిన కాజల్..!

అందాల చందమామ కాజల్ ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తుంది కానీ, చాలా కాలం నుంచి ఆమె ట్విట్టర్లో లేదు. గతంలో ఒకసారి ట్విట్టర్ ఎకౌంట్ ను మెయింటెయిన్ చేసినా, ఎందువల్లనో దాన్ని మధ్యలోనే వదిలేసింది. సెలబ్రిటీ అయి ఉండీ, ట్విట్టర్ లేకపోవడం ఆశ్చర్యమే అయినా, ఇది నిజమే. ఫేస్ బుక్ లో ఆమె ఫాలోవర్ల సంఖ్య రెండు కోట్లను సమీపిస్తోంది. ఫేస్ బుక్ లో చాలా యాక్టివ్ గా ఉండే కాజల్ ఇన్నాళ్లూ ఎందుకో ట్విట్టర్ పై పెద్ద ఆసక్తి చూపించలేదు. లేటెస్ట్ గా బ్రహ్మోత్సవం సందర్భంగా ట్విట్టర్ లో ఎకౌంట్ ఓపెన్ చేసిందీ భామ. మహేష్ తో తాను కలిసున్న పోస్టర్ ను మొదటి ట్వీట్ గా పోస్ట్ చేసింది. ఆమెకు ట్విట్టర్ కు ఘనస్వాగతం లభించింది. అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా కాజల్ ట్విట్టర్ కు రావడం పట్ల ట్వీట్ చేశారు. ఇన్నాళ్లూ ఫేస్ బుక్ లో హల్ చల్ చేసిన కాజల్, ఇక ట్విట్టర్లో కూడా అభిమానులతో సందడి చేయనుంది. కాగా, ఇప్పుడు కాజల్ ఆశలన్నీ బ్రహ్మోత్సవం పైనే ఉన్నాయి. ఎన్నో అంచనాలతో రిలీజైన సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ కావడంతో, మహేష్ తో సినిమా అయినా బ్రేక్ ఇస్తుందేమోనని ఎదురుచూస్తోంది కాజల్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.