English | Telugu

బాస్ ట్వీట్ కి మాస్ రిప్లై!

చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏదైనా సినిమా నచ్చితే, ఆ చిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందలు తెలపడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. తాజాగా ఆయన 'దసరా' మూవీ టీమ్ ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ కి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇచ్చిన రిప్లై మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది.

నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'దసరా'. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న విడుదలైంది. రెండు వారాల్లో వరల్డ్ వైడ్ గా రూ.60 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ మూవీ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాని ఎందరో స్టార్స్ ప్రశంసించగా, తాజాగా మెగాస్టార్ సైతం ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. దసరా చిత్రం అద్భుతంగా ఉందని ట్విట్టర్ వేదికగా చిరంజీవి ప్రశంసించారు. నాని, కీర్తి నటన ఆకట్టుకుందని, దర్శకుడు శ్రీకాంత్ కి ఇది మొదటి సినిమా అని తెలిసి ఆశ్చర్యపోయానని చిరు అన్నారు.

దసరా చిత్రాన్ని ప్రశంసిస్తూ చిరంజీవి ట్వీట్ చేయడంపై నాని, శ్రీకాంత్ ఓదెల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ ట్వీట్ కి, శ్రీకాంత్ ఇచ్చిన రిప్లై ఆకట్టుకుంటోంది. 'ఎగురుతున్న.. థాంక్యూ బాస్' అంటూ చిన్నతనంలో తాను 'ఇంద్ర' వీణ స్టెప్ వేస్తున్న ఫోటోను జోడించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.