English | Telugu
మెగాస్టార్ చేయి జారి ప్రియాంక చోప్రా చేతికి చేరింది..!
Updated : Apr 20, 2016
ఇంక్రెడిబుల్ ఇండియా అన్న నినాదాన్ని దేశ విదేశాల్లో ఉన్న విదేశీయులకు వినిపించాలంటే, అందుకు భారతదేశం తరపున చాలా ప్రతిష్టాత్మకమైన వ్యక్తి కావాలి. మొత్తం దేశ ప్రతిష్ట తరపున బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే ఈ రోల్ చాలా ముఖ్యమైనది, గర్వకారణమైంది. గత కొన్నేళ్లుగా అమీర్ ఖాన్ ఈ బ్రాండ్ ను బాగా నిలబెట్టాడు. ఇంక్రెడిబుల్ ఇండియా అంటూ యాడ్ క్యాంపెయిన్లు చేశాడు. కానీ భారతదేశంలో అసహనం గురించి కాస్త టంగ్ స్లిప్ అవడంతో, ఈ గౌరవ హోదా కూడా అమీర్ నుంచి స్లిప్ అయింది. ఆ తర్వాత బాలీవుడ్ లెజండ్, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా పెడదామనుకున్నారు మోడీ. ఆయనకు బిగ్ బీ వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టం. ఈలోపే పనామా పేపర్స్ లీక్ కావడం, వాటిలో బిగ్ బీ పేరుండటంతో ఆయన్ను కూడా పక్కకు పెడుతున్నారట. దేశ విదేశాల్లో అవార్డులు అందుకుంటూ, రీసెంట్ గా పద్మశ్రీని స్వీకరించిన ప్రియాంక చోప్రా అయితే, ఇండియా బ్రాండ్ కు కరెక్ట్ గా ప్రాతినిథ్యం వహించగలదని భారత ప్రభుత్వం అభిప్రాయపడుతోందట. అంతేకాక, ఇంక్రెడిబుల్ ఇండియాను అత్తుల్య భారత్ గా మార్చే ఆలోచన కూడా భారత ప్రభుత్వానికి ఉందట. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.