English | Telugu
బాలయ్య హీరోయిన్ కు ఫోబియా అట..!
Updated : Apr 20, 2016
బాలయ్య సరసన రెండు సినిమాలు చేసిన రాధికా ఆప్టే ఆ తర్వాత కంప్లీట్ గా బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ బోల్డ్ ఫిలిమ్స్ తో యాక్ట్రెస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. షార్ట్ ఫిలిం చేసినా, పెద్ద సినిమా చేసినా వాటిలో తన మార్క్ స్పష్టంగా వేస్తోందీ భామ. రీసెంట్ గా రాధికా ప్రధానపాత్రలో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఫోబియా పేరుతో రీలిజవుతున్న ఈ సినిమాలో, మెహక్ అనే ఆర్టిస్ట్ క్యారెక్టర్లో ఆప్టే కనిపించబోతోంది. అనేక ఒత్తిళ్లు, భయాలు మధ్య ఆమె గడిపిన జీవితం ఎలా ఉంది అన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాకు సంబంధించిన మేటర్ ను క్లుప్తంగా, ఒకే ఒక్క పోస్టర్ లో అందరికీ అర్ధమయ్యే విధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ టీం రిలీజ్ చేశారు. ఈ క్యారెక్టర్ ప్లే చేయడం, రాధిక సైక్రియాటిస్టులను కలిసి, ఫోబియా ఉన్న వాళ్లు ఎలా ప్రవర్తిస్తారు, ఏం చేస్తారు అన్న వివరాలను తెలుసుకుందట. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పవన్ కృపాళిని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా రజనీ సరసన కబాలీ లో కూడా రాధికా నటించింది. కబాలీలో ఆమెది వయసు మళ్లిన పాత్ర కావడం విశేషం.