English | Telugu

మెగా క్యాంప్ కు షిఫ్ట్ అవుతున్న బోయపాటి..?

బోయపాటి శ్రీను. ప్రస్తుతం మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడున్న దర్శకుల్లో పూర్తి స్థాయి మాస్ సినిమాలు తీసే కెపాసిటీ ఉన్న అతి కొద్దిమందిలో బోయపాటి కూడా ఒకరు. ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు భారీ హిట్లు ఇచ్చి మళ్లీ ఫాంలోకి తీసుకొచ్చిన ఘనత కూడా బోయపాటికే దక్కుతుంది. అప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న బాలయ్య కెరీర్ సింహా, లెజండ్ సినిమాలతో మళ్లీ ఊపందుకుంది. దీనికి ఫుల్ క్రెడిట్ బోయపాటికి ఇవ్వాల్సిందే. ఈ సినిమాల తర్వాత బాలయ్యకు బోయపాటికి బాగా సింక్ అవుతుందనే పేరు వచ్చేసింది. స్వయంగా బాలకృష్ణే చాలా సార్లు ఈ విషయం చెప్పారు. ఈ ఇంపాక్ట్ తో బోయపాటికి నందమూరి క్యాంప్ డైరెక్టర్ అనే ముద్ర పడిపోయింది. ఎన్టీఆర్ తో కూడా దమ్ము చేశారు బోయపాటి. లేటెస్ట్ గా సరైనోడు సినిమాతో ఇప్పుడు ఆయన మెగా క్యాంప్ కు చేరువౌవుతున్నారనే మాట వినిపిస్తోంది.

దానికి తగ్గట్టే, చిరంజీవి కూడా బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ తనతో సినిమా చేయాలని స్వయంగా సరైనోడు స్టేజ్ మీద అడిగారు. అన్నీ కుదిరితే చిరు 151 వ సినిమా బోయపాటి డైరెక్షన్లోనే ఉండే అవకాశం ఉంది. సరైనోడు రిజల్ట్ బట్టి చరణ్ తో కూడా బోయపాటి సినిమా ఉండే అవకాశం లేకపోలేదు. ఈ టాక్ కారణంగానే బాలయ్య కూడా తన వందో సినిమాను క్రిష్ కు అప్పగించారట. నిజానికి మొదట తన వందో సినిమాను బోయపాటికి ఇస్తారని లెజండ్ సమయంలోనే వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా కృష్ణవంశీ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత అంతే సడెన్ గా క్రిష్ సినిమా అనౌన్స్ అయిపోయింది. ఈ నేపథ్యంలో బాలయ్యతో బోయపాటి సినిమా ఇప్పట్లో ఉంటుందా లేదా అన్నది అనుమానంగా మారింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.