English | Telugu
కబాలీ వాయిదా వేసిన రజనీకాంత్..!
Updated : Apr 12, 2016
గత కొన్నేళ్లుగా సూపర్ స్టార్ రజినీ ఫాం లో లేరు. ముఖ్యంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజైన కొచ్చాడయాన్, లింగా సినిమాలు భారీ అట్టర్ ఫ్లాపులుగా మారడంతో, ఆయన అభిమానులు డిజప్పాయింట్ అయిపోయారు. దీంతో వాళ్లకు ఎలాగైనా భారీ హిట్ ఇవ్వాలని, మాఫియా జానర్ లో కబాలీ మొదలెట్టారు రజనీ. ఇప్పటికే పోస్టర్లతో కబాలీ సినిమా కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అనే నమ్మకంలో రజనీ అభిమానులున్నారు. షూటింగ్ మొదలైనప్పుడు ఏప్రిల్ 2016లో రిలీజ్ చేస్తారని అనుకున్నా, తమిళనాడు జనరల్ ఎలక్షన్ల ఎఫెక్ట్ తో, మూవీని వేసవి కానుకగా ఇస్తున్నామంటూ మే నెలకు పోస్ట్ పోన్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఇంకా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ పూర్తవ్వని కారణంగా, జూన్ లేదా జూలై వరకూ కబాలి రిలీజ్ కాదని చెబుతున్నారు మూవీ టీం. ఈ వేసవిలోనే తమ అభిమాన రజనీ సినిమాను ఎంజాయ్ చేద్దామనుకున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ న్యూస్ నిరాశను కలిగించేదే. మరోవైపు సినిమాలో తన షూట్ ను కంప్లీట్ చేసేసి, రోబో 2.0 లో బిజీ అయిపోయారు రజనీ. ఈ మధ్యే లీకైన విలన్ పాత్రధారి అక్షయ్ కుమార్ స్టిల్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది.