English | Telugu

‘మాయే చేశావే..’ సిధ్‌ శ్రీరామ్‌ పాట, కళ్యాణ్‌రామ్‌, సంయుక్త ఆట

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై దర్శకనిర్మాత అభిషేక్‌ నామా నిర్మిస్తున్న డిఫరెంట్‌ మూవీ ‘డెవిల్‌’. బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ ట్యాగ్‌లైన్‌. ఇటీవల విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రాన్ని నవంబర్‌ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్‌.
‘మాయే చేశావే’ అంటూ సాగే ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఈ పాటను ఐకాన్‌ మ్యూజిక్‌ విడుదల చేసింది. చక్కని మెలోడీగా రూపొందిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ అద్భుతంగా ఆలపించి ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించారు. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ ఈ పాటను స్వరపరిచారు. స్వాతంత్య్రానికి ముందు ఉన్న బ్యాక్‌డ్రాప్‌లో కథ కావడంతో దానికి తగ్గట్టుగానే అన్ని విషయాల్లోనూ కేర్‌ తీసుకున్నారు. పాట చిత్రీకరణలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకొని చేశారు. బృంద మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ జరిగింది. కళ్యాణ్‌రామ్‌, సంయుక్తలపై ఈ పాటను చిత్రీకరించారు.