English | Telugu

రవితేజ సరసన మళ్ళీ ఇలియానా

మాస్ మహరాజా రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా గతంలో "ఖతర్నాక్" అనే సూపర్ ఫ్లాప్ చిత్రం, అలాగే "కిక్" అనే సూపర్ హిట్ చిత్రం వచ్చాయి. ముచ్చటగా మూడవ సారి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రానుంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారు. రవితేజ హీరోగా గతంలో "ఖతర్నాక్" అనే చిత్రాన్ని, "ఈ అబ్బాయి చాలా మంచోడు" అనే చిత్రాన్నీ నిర్మించిన బి.వి.యస్.యన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం.

2002 లో రవితేజ హీరోగా, రక్షిత హీరోయిన్ గా స్వీయ దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ నిర్మించిన "ఇడియట్" సూపర్ హిట్టయి, హీరో రవితేజకి ఒక స్టార్ ఇమేజ్ ని అందించింది. మళ్ళీ పన్నేండేళ్ళకి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అంటే 2012 మార్చ్ 15 వ తేదీన, బ్యాంకాక్ లో "ఇడియట్" చిత్రానికి సీక్వెల్ గా "ఇడియట్ -2" చిత్రం ప్రారంభమవుతుందని ఫిలిం న్గర్ వర్గాలంటున్నాయి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.