English | Telugu

క్రిస్మస్ కానుకగా "అధినాయకుడు" ఆడియో

శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై, యువరత్న నందమూరి బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తూండగా, పరుచూరి మురళి దర్శకత్వంలో, యమ్.యల్.కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం"అధినాయకుడు". ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని డిసెంబర్ 25 వ తేదీన, క్రిస్ మస్ పండగ కానుకగా విడుదల చేయాలని నిర్మాత సన్నాహాలు చేస్తున్నాట్లు సమాచారం.

ఈ చిత్రంలో నటసింహ బాలకృష్ణ తాతగా, తండ్రిగా, మనవడిగా మూడు విభిన్నమైన గెటప్పుల్లో, మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ "అధినాయకుడు" చిత్రం 2012 జనవరి 12 వ తేదీన రానున్న సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రంతో పాటు ఇంకా "నిప్పు, పంజా, బిజినెస్ మ్యాన్, రాజన్న, లవ్లీ, బాడీ గార్డ్" వంటి చిత్రాలు కూడా ఈ సంక్రాంతి రేస్ లో ఉన్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.