English | Telugu
ఎఫైర్‌కైనా రెడీ
Updated : Jun 21, 2013
"దేనికైనా రెడీ" చిత్రంలో జంటగా నటించిన విష్ణు, హన్సికల నడుమ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతోపాటు, ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. దాంతో ఈ ఇద్దరూ మరోసారి జతకడుతున్నారు. హిందీలో రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రూపొంది ఘన విజయం సాధించిన "గోల్‌మాల్-3" చిత్రం రీమేక్‌లో తన ఇద్దరు తనయులు విష్ణు, మనోజ్‌లతోపాటు మోహన్‌బాబు కలిసి నటిస్తుండడం తెలిసిందే. ఈ ముగ్గురుతోపాటు ఈ చిత్రంలో వరుణ్‌సందేశ్, తనీష్ కూడా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో మోహన్‌బాబుకు జంటగా రవీనాటండన్ నటిస్తుండగా.. మనోజ్ పక్కన ప్రణీత నటిస్తోంది. ఇక విష్ణు సరసన హన్సిక సరసాలాడుతోంది.
"లక్ష్యం" ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో మోహన్‌బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. విష్ణు, హన్సిక వరుసగా రెండు చిత్రాల్లో నటిస్తుండడం.. ఆ రెండు చిత్రాలు మాతృసంస్థకు చెందినవి కావడంతో... ఈ ఇద్దరి మధ్య "సమ్‌థింగ్.. సమ్‌థింగ్" అనే గుసగుసలు మొదలయ్యాయి. "దేనికైనా రెడీ" చిత్రంతో మొదలైన వీరిద్దరి "కెమిస్ట్రీ" ఎఫైర్‌కైనా రెడీ అనే స్థాయికి వెళ్తుందేమో చూడాలి!