English | Telugu
మళ్లీ విష్ణు ''ఢీ'' కొట్టబోతున్నాడు
Updated : Nov 10, 2014
మంచు విష్ణు కెరీర్‌లో మర్చిపోలేని సినిమా.. 'ఢీ'. ఆ సినిమా టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సృష్టించింది. విలన్ ఇంట్లో హీరో దూరి.. అక్కడ తమాషాలు చేయడం, మైండ్ ప్లే నడిపించడం ఇలాంటి కథలు ఢీతో ఊపందుకొన్నాయి. విష్ణు కామెడీ బాగా చేయగలడని ఈ సినిమా నిరూపించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని విష్ణు ధృవీకరించాడు కూడా. ఆల్రెడీ 'ఢీ 2'కి సంబంధించిన కథ సిద్ధమైందట. వచ్చే యేడాది లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి విష్ణు మాట్లాడుతూ ''నాలోని కామెడీ యాంగిల్ టచ్ చేసిన సినిమా ఢీ. ఆ సినిమాని ఎప్పటికీ మర్చిపోలేను. దాని కొనసాగింపు కథగా ఓ స్ర్కిప్ట్ సిద్ధమైంది. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాని టేకప్ చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు చెబుతా'' అన్నారాయన. ప్రస్తుతం ఆయన నటించిన 'ఎర్రబస్సు' విడుదలకు సిద్ధమైంది. ఈనెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.