English | Telugu
అతిథిగా వచ్చి హీరోయిన్ అయ్యింది!
Updated : Nov 9, 2014
మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది లావణ్య త్రిపాఠీ. అదీ ఒక్క నిమిషం కూడా ఉండదు. హీరోయిన్ గా చేయాల్సిన సమయంలో ఇలాంటి పాత్రలేంటి?? అని చాలామంది పెదవి విరిచారు. అయితే ఆ పరిచయం, అనుభవం ఇప్పుడు లావణ్య త్రిపాఠీకి పనికొచ్చాయి... ఇప్పుడు ఏకంగా అక్కినేని కాంపౌండ్ హీరోయిన్ అయిపోయింది. నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ''సోగ్గాడే చిన్ని నాయనా'' అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇందులో కథానాయికగా లావణ్య త్రిపాఠీని ఎంచుకొన్నారని సమాచారమ్. మరో నాయిక పాత్రలో రమ్యకృష్ణ నటించనుంది. ఈ సినిమాలో నాగ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. నిధి అన్వేషణకు సంబంధించిన కథ ఇది. ఈ నెలలోనే చిత్రీకరణ మొదలవుతుంది.