English | Telugu
మంచు లక్ష్మీ ముంబైకి మకాం మార్చింది... అందుకేనా?
Updated : Oct 12, 2023
‘న్యూ సిటీ, న్యూ ఎరా.. ఈ జీవితానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను.. నన్ను నమ్ముతూ నా వెంటే ఉండే నా అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ మంచు లక్ష్మీ వేసిన న్యూ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. న్యూ సిటీ అంటే లక్ష్మీ మకాం ఇప్పుడు ముంబైకి మార్చిందట. దానికి సంబంధించిన ట్వీటే అది. సడన్‌గా ముంబై ఎందుకు షిఫ్ట్ అయ్యింది? బాలీవుడ్‌లో ఆఫర్స్ వస్తున్నాయా? అక్కడి దర్శకనిర్మాతలకు అందుబాటులో వుండేందుకు ఇలా చేసిందా? నీకు హిందీ వచ్చా అక్కా?... ఇలా రకరకాలుగా మంచు లక్ష్మీపై కామెంట్స్ విసురుతున్నారు నెటిజన్లు. మంచు లక్ష్మీ తెలుగు, ఇంగ్లీష్‌ను కలగలిపి ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడడం మనం ఇప్పటివరకు చూశాం. ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ స్లాంగ్‌లో మరో డిఫరెంట్ లాంగ్వేజ్ మంచు లక్ష్మీ వాయిస్‌లో వినబోతున్నాం. బీ... రెడీ అంటూ ఫన్నీగా ఆమె గురించి ట్వీట్స్ వేస్తున్నారు.
ఇంతకీ మంచు లక్ష్మీ ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు రీజన్ ఏమిటి అనే విషయంలో ఆమె క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇకపై తన సత్తా హిందీ సినిమాల్లో చూపిస్తానంటూ అక్కడి మీడియాకి తెలియజేసింది లక్ష్మీ. మరి బాలీవుడ్‌లో ఆమెను ఎలాంటి రోల్స్ వరిస్తాయో... ఆమె టాలెంట్‌ను ఏ రేంజ్ చూపిస్తుందో చూడాలి.