English | Telugu
సమంతకు నయనతార స్పెషల్ గిఫ్ట్... ఏమిటో తెలుసా?
Updated : Oct 12, 2023
సౌత్ ఇండియన్ సినిమాలో నయనతార రేంజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. సౌత్‌లోని అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ యంగ్ హీరోయిన్లకుసైతం మంచి పోటీ ఇస్తుంది. జవాన్ సినిమాతో హిందీలోనూ తన మార్క్‌ను చూపించిన నయనతార బిజినెస్ రంగంలో కూడా అడుగు పెట్టినట్టు ఇటీవలే ప్రకటించారు. 9 స్కిన్ పేరుతో కాస్మొటిక్ ప్రొడక్ట్స్‌ను తయారు చేసి మార్కెటింగ్ చేస్తోంది. ఇక టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయిపోయింది. నయనతార, సమంత మంచి ఫ్రెండ్స్ అన్ని విషయాలను ఇద్దరూ షేర్ చేసుకుంటూ ఉంటారు.
ఆ ఫ్రెండ్‌షిప్ కొద్దీ నయనతార ఒక స్పెషల్ గిప్ట్‌ను సమంతకు పంపించింది. అదేమిటంటే 9 స్కిన్ ఫేస్ క్రీమ్ ప్రొడక్ట్స్‌ను స్పెషల్‌గా పంపించింది. నయన్ తనకు ఈ గిఫ్ట్ పంపడం చాలా సంతోషంగా ఉందని తన ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. అంతేకాదు కొత్తగా బిజినెస్‌రంగంలోకి అడుగు పెట్టిన నయన్‌కు శుభాకాంక్షలు కూడా తెలియజేసింది సమంత. 9 స్కిన్ ప్రొడక్ట్స్ తనకు తెలుసునని, వాటిని వాడడానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని తెలియజేసింది. ఇలా ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరినొకరు విష్ చేసుకోవడం, సమంతకు స్పెషల్ గిఫ్ట్ పంపడం వారిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ని తెలియజేస్తోందని నెటిజన్లు ఈ విషయంలో చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.