English | Telugu
'మెగా 157'లో విలన్ గా రానా!
Updated : Oct 12, 2023
మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఈ మూవీలో రానా దగ్గుబాటి విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
రానా కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరో పాత్రలకే పరిమితమవ్వకుండా విభిన్న పాత్రలతో అలరిస్తున్నాడు. ముఖ్యంగా 'బాహుబలి'లో అతను పోషించిన నెగటివ్ రోల్ 'భల్లాల దేవ' ఎంతో పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు మెగాస్టార్ కోసం రానా మరోసారి విలన్ గా మారడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. 'మెగా 157'లో చిరంజీవిని ఢీ కొట్టే విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, అందుకే ఈ పాత్ర కోసం రానాని సంప్రదించినట్లు తెలుస్తోంది. రానా సైతం ఈ పాత్ర చేయడానికి వెంటనే అంగీకరించాడట.
కాగా మెగా ఫ్యామిలీతో రానాకి మంచి అనుబంధముంది. రామ్ చరణ్, రానా మంచి స్నేహితులు. అంతేకాదు గతేడాది 'భీమ్లా నాయక్'లో పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు రానా. ఇక ఇప్పుడు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం విశేషం.