English | Telugu

నంది అవార్డ్ పగ.. నాగ్ స్కెచ్‌ సూపరబ్బా..?

తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌గా, మేధావిగా అక్కినేని నాగార్జునకు పేరు. ఎవరిని ఎలా డీల్ చేయాలో.. కర్ర విరక్కుండా పాము చావకుండా ప్రత్యర్థిని ఎలా దెబ్బకొట్టాలో నాగ్‌ను చూసి నేర్చుకోవచ్చు అనేది ఫిలింనగర్‌ జనాలు తరచుగా అనుకునే మాట. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ఎంత దుమారం రేగింతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహానటుడు ఏఎన్నార్ సహా.. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన మనం సినిమాకు అవార్డుల్లో అన్యాయం జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలోనూ.. మరికొంత మంది ప్రెస్‌మీట్లు పెట్టి మరి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

బాలయ్య-నాగ్ మధ్య ఉన్న మనస్పర్థల కారణంగానే మనంని కావాలనే పక్కనబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే నాగార్జున కానీ, అక్కినేని కుటుంబసభ్యులు కానీ ఎక్కడా దీనిపై స్పందించలేదు. కానీ ఎంతోకొంత డిస్పాయింట్ అయ్యుంటారన్నది వాస్తవం. నాగ్ తప్పకుండా దీనిపై ప్రతీకారం తీర్చుకుంటారని చాలా మంది భావించారు. మేధావులు అందిరిలా ఆవేశపడరు. తమ టైం వచ్చేదాకా వెయిట్ చేస్తారని పెద్దలు అంటూ ఉంటారు.

అఖిల్-విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హలో థియేట్రికల్ ట్రైలర్‌ రీసెంట్‌గా రిలీజైంది. ఈ ట్రైలర్ స్టార్టింగ్ టైంలో వేసిన కార్డ్స్‌‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. బిగినింగ్‌లో "ఫ్రమ్ ద మేకర్స్" ఆఫ్ మనం అంటూ వేసిన కార్డ్ తర్వాత "మీ హృదయాలతో ఇచ్చిన అవార్డులు" అంటూ వచ్చిన కార్డ్ వైరల్ అవుతోంది. నంది అవార్డ్ రానుందుకే ఈ కార్డ్ ద్వారా నాగ్ తన కసిని తీర్చుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తను ఎవరు..? ఎందుకు..? రాజేశారో తెలియదు కానీ.. దీనిని చూసిన వారు మాత్రం ఇందులో ఎంతో కొంత నిజం ఉండొచ్చు అంటూనే.. నాగ్ ఇంటెలిజెన్స్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారట.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.