English | Telugu

శశికపూర్ ఎందుకు గ్రేటో.. పది ముక్కల్లో చూద్దాం..!!

అలనాటి బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు శశికపూర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ముంబైలో మరణించారు. ఇండియన్ సినిమాకు మూలస్తంభాల్లో ఒకరైన పృథ్వీరాజ్ కపూర్‌ మూడో కొడుకే శశికపూర్. 60, 70 దశకాల్లో రొమాంటిక్ హీరోగా వెలుగొందిన శశి, కెరీర్‌లో మొత్తం 116 బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చివరి సినిమా హాలీవుడ్ చిత్రం "సైడ్ స్ట్రీట్స్". ఈ సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్యకోణాలను తెలుసుకుందాం.

* శశికపూర్ అసలు పేరు బల్బీర్ రాజ్ కపూర్. 1938 మార్చి 18న కలకత్తాలో జన్మించారు.
* నాలుగేళ్ల చిరుప్రాయంలోనే నాటకాలు వేశారు శశి
* "ధర్మపుత్ర" హీరోగా ఆయన తొలి సినిమా.
* హాలీవుడ్ చిత్రంలో నటించిన తొలి ఇండియన్ హీరో
* ఇంగ్లాండ్‌కు చెందిన నటి జన్నీఫర్ కెందల్‌తో పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి వివాహానికి జెన్నీ తండ్రి అభ్యంతరం తెలిపారు. కానీ తన బంధువుల మద్ధతుతో శశికపూర్ ఆమెను వివాహం చేసుకున్నారు.
* 1974-77 మధ్య శశికపూర్ నటించిన దాదాపు పది సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అప్పటి నుంచి ఆయన మెల్లగా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ వచ్చారు.
* శశికపూర్ తన కెరీర్‌లో ఏకంగా 54 మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. అందులో అత్యధికంగా అమితాబ్‌తో 12 సినిమాలు చేశారు. అందుకే వీరిద్దరిని వెండితెర అన్నదమ్ములు అనేవారు.
* అప్పట్లో రాజేశ్‌ఖన్నాతో శశికపూర్‌కి తీవ్రమైన పోటీ ఉండేది. రాజేశ్ వద్దన్న సినిమాను శశితో తీసేందుకు దర్శకనిర్మాతలు మొగ్గు చూపేవారు.
* తోటీ హీరోల మధ్య ఉన్న పోటీని ఆయన సానుకూలంగా తీసుకునేవారు.. అందుకే శశికపూర్‌కు విభేదాలు ఉండేవి కావు.
* నేటితరం నటులు శశికపూర్‌ని ముద్దుగా "శశిబాబా" అని పిలిచేవారు.
* శశికపూర్‌కు మూడు నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు వరించాయి.
* భారతీయ సినిమాకు ఈయన చేసిన సేవలకు గాను కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతోనూ.. దాదాసాహెబ్ ఫాల్కేఅవార్డుతోనూ సత్కరించింది.
* 'దీవార్‌'లో 'తుమ్హారే పాస్‌ క్యా హై' అని అమితాబ్‌ వేసిన ప్రశ్నకు 'మేరే పాస్‌ మా హై' అని శశికపూర్‌ చెప్పిన ఆ రోజుల్లో దేశమంతా మారుమోగింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.