English | Telugu
మమతా బెనర్జీ లైఫ్ స్టోరీతో సినిమా
Updated : Feb 29, 2016
వెస్ట్ బెంగాల్ సిఎం మమతా బెనర్జీకి డైనమిక్ లేడీగా పేరుంది. ఆవిడ చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వేగంగా ఉంటాయి. తాజాగా ఆమె జీవిత కథతో ' బాఘిని ' అనే బెంగాలీ సినిమా రాబోతోంది. బాఘిని అంటే ఆడ పులి అని అర్ధం. నేహాల్ దత్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బెంగాలీ నటి రుమా చక్రవర్తి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బాఘిని కోసం దర్శకుడు దాదాపు మూడేళ్లు రీసెర్చ్ చేశారట. మమతా బెనర్జీ పై వచ్చిన ఆర్టికల్స్, బయోగ్రఫీలు తనకు చాలా ఉపయోగపడ్డాయని ఆయన అంటున్నారు. ఈ ఏడాది కోల్ కతా అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో, ఇప్పుడీ సినిమా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలలోపే దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇది దీదీ జీవిత చరిత్ర కాదని, కేవలం ఇన్ స్పిరేషన్ మాత్రమే నని నేహాల్ చెప్పడం కొసమెరుపు.