English | Telugu

ఇవే ఆస్కార్ అవార్డ్స్..!

సినిమా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆస్కార్లను భావిస్తారు. ఈ ఏడాది అవార్డ్స్ తో కలిపి ఇప్పటి వరకూ 88 ఆస్కార్ ఫంక్షన్లు జరిగాయి. ఈసారి ఆస్కార్లలో ప్రత్యేకత, మన భారతీయ నటి ప్రియాంక చోప్రా అవార్డ్ ప్రదానం చేయడమే. ట్రాన్స్ పరెంట్ లాంగ్ డ్రస్ లో వచ్చిన ప్రియాంక మెరిసిపోయింది. ఈ 88వ ఆస్కార్ ఫంక్షన్స్ లో మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ సినిమా అత్యధికంగా 6 ఆస్కార్లను గెలుచుకుంది. లియోనార్డో డికాప్రియో నటించిన ది రివనెంట్ సినిమా 3 ఆస్కార్లు గెలుచుకుంది. వాటిలో లియోకు వచ్చిన ఉత్తమ నటుడి అవార్డ్ కూడా ఉంది. ఇదే ఈసారి అవార్డ్స్ కు హైలెట్..

88వ ఆస్కార్ అవార్డులు ఇవే :

బెస్ట్ పిక్చర్ – స్పాట్ లైట్
బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ – లియోనార్డో డి కాప్రియో ( ది రెవినెంట్)
బెస్ట్ యాక్ట్రెస్ లీడింగ్ రోల్ – బ్రై లార్సన్ (రూమ్)
బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ – మార్క్ రైల్యాన్స్ ( బ్రిడ్జ్ అఫ్ స్పైస్)
బెస్ట్ యాక్ట్రెస్ సపోర్టింగ్ రోల్ – అలీసియా వికెందర్ ( ది డానిష్ గర్ల్)
బెస్ట్ డైరక్టర్– అలజెండ్రో ఇనారిటు (ది రెవినెంట్)
బెస్ట్ సినిమాటోగ్రాఫి – ఎమ్మాన్యుల్ లుజ్బెకి (ది రెవినెంట్)
బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్) – రైటింగ్స్ అఫ్ ది వాల్ – స్పెక్టర్
బెస్ట్ మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) – ది హెట్ ఫుల్ ఎయిట్
బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ – సన్ అఫ్ సోల్
బెస్ట్ షార్ట్ ఫిల్మ్ (లైవ్ యాక్షన్) – స్ట్రుట్టెటర్
బెస్ట్ డాక్యుమెంటరీ (ఫ్యూచర్) – అమీ
బెస్ట్ షార్ట్ ఫిల్మ్ యానిమేటెడ్ – బేర్ స్టొరీ
బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ – ఇన్సైడ్ అవుట్
బెస్ట్ డాక్యుమెంటరీ ( షార్ట్ సబ్జెక్ట్) – ఏ గర్ల్ ఇన్ ది రివర్ – ది ప్రైస్ అఫ్ ఫర్ గివ్ నెస్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రైటింగ్ – స్పాట్ లైట్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే రైటింగ్ – ది బిగ్ షార్ట్
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – ఎక్స్ మాచిన
బెస్ట్ సౌండ్ మిక్సింగ్ – మ్యాడ్ మ్యాక్స్ – ఫ్యూరి రోడ్
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ – మ్యాడ్ మ్యాక్స్ – ఫ్యూరి రోడ్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – మ్యాడ్ మ్యాక్స్ – ఫ్యూరి రోడ్
బెస్ట్ మెక్ అప్ అండ్ హెయిర్ స్టైలింగ్ – మ్యాడ్ మ్యాక్స్ – ఫ్యూరి రోడ్
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ – మ్యాడ్ మ్యాక్స్ – ఫ్యూరి రోడ్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – మ్యాడ్ మ్యాక్స్ – ఫ్యూరి రోడ్

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.