English | Telugu
పోస్టర్ లో ఇది గమనించారా?.. ఇది కదా మహేష్ ఫ్యాన్స్ కి కావాల్సింది!
Updated : Aug 9, 2023
నేడు(ఆగస్టు 9న) సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'గుంటూరు కారం' చిత్రం నుంచి తాజాగా కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. లుంగీ కట్టుకొని, కళ్లద్దాలు పెట్టుకొని, బీడీ తాగుతున్న మహేష్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూసి మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఈ పోస్టర్ లో మహేష్ లుక్ కంటే కూడా.. మరో విషయం వారికి మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.
'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12 న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుండటంతో.. విడుదల తేదీ వాయిదా పడే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అభిమానుల్లో కూడా ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే ఆ అనుమానాలన్నింటికి చెక్ పెడుతూ.. మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో 2024, జనవరి 12 నే సినిమాని విడుదల చేస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు మేకర్స్. దీంతో మహేష్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.