English | Telugu
వరలక్ష్మి సెంటిమెంట్.. ఆ డైరెక్టర్‌తోనే మరోసారి!
Updated : Aug 12, 2023
కోలీవుడ్ నటి అయిన వరలక్ష్మి శరత్‌కుమార్‌కి తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ క్రేజ్ ఆమె కెరీర్లో గుర్తుండిపోయే పాత్రలన్నీ తెలుగు సినిమాల్లోనివే మరి. ఆమె ఈ విషయాన్ని కొన్ని ఇంటర్వ్యూస్‌లో బహిరంగంగానూ చెప్పింది. తాజాగా ఓ డైరెక్టర్ తాను చేయబోతున్న నెక్ట్స్ మూవీలో ఆమెను సెంటిమెంట్‌గా కంటిన్యూ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. గోపీచంద్ మలినేని. వివరాల్లోకి వెళితే ఈయన గత రెండు సినిమాలు క్రాక్, వీరసింహా రెడ్డి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన సంగతి విదితమే. ఇప్పుడీయన తన తదుపరి చిత్రాన్ని రవితేజతో చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
రవితేజతో నెక్ట్స్ చేయబోయే సినిమాలో హీరోయిన్ విషయంలో గోపీచంద్ మలినేని ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ, కీలక పాత్రధాలో వరలక్ష్మి కోసం ఓ పాత్రను డిజైన్ చేశారని టాక్. ఇంతకు ముందు ఈయన తెరకెక్కించిన క్రాక్ సినిమాలో వరలక్ష్మి చేసిన జయమ్మ పాత్రను ఎవరూ అంత సులువుగా మరచిపోలేరు. ఆ తర్వాత వీరసింహా రెడ్డి సినిమాలో బాలయ్య సోదరి పాత్రలోనూ నెగటివ్ షేడ్స్‌తో వరలక్ష్మి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గోపీచంద్ మలినేని లక్కీ లేడీగా భావించి మరోసారి వరలక్ష్మి శరత్ కుమార్‌ను తన సినిమా కోసం స్పెషల్ రోల్‌ను డిజైన్ చేశారు.
మరో వైపు రవితేజ, గోపీచంద్ మలినేని కూడా సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు నాలుగోసారి వారిద్దరూ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.