English | Telugu

బ్రహ్మోత్సవం మోషన్ పోస్టర్ ను కాపీ అంటారా..?

ఈ మధ్య టాలీవుడ్ లో ఏం చేసినా, కాపీ అనే ట్యాగ్ ను చాలా ఫాస్ట్ గా తగిలించేస్తున్నారు. నిజంగా కాపీ కొడితే, ఐడెంటిఫై చేసినా తప్పు లేదు. కానీ కొంత మంది ఏదో కనిపెట్టేసినట్టు, మామూలుగా వాడిన వాటిని కూడా కాపీ అనేయడం చాలా కామెడీగా అనిపిస్తుంటుంది. ఉదాహరణకు లేటెస్ట్ గా బ్రహ్మోత్సవం మోషన్ పోస్టర్ రిలీజైంది. మూడు చక్రాల బైక్ మీద మహేష్ కూర్చుని ఉన్న ఆ షాట్ చూసి, ఇది రాజస్థాన్ టూరిజం యాడ్ లో వాడిన బైక్, దానిని కాపీ కొట్టేశారు అంటూ నెట్ లో ప్రచారం మొదలెట్టేశారు. రాజస్థాన్ లో ఇలాంటి విచిత్రమైన బైక్ లు, ఆటోలు చాలానే కనిపిస్తాయి.

టోటల్ గా కాపీ అనే పదానికే ఇక్కడ అర్ధం మార్చేయడం విచిత్రం. ఒక సీన్, లేక మ్యూజిక్ లాంటివి కాపీ కొట్టేశారు అని అంటే అర్ధముంది. కానీ బైక్ లు, కార్లు లాంటి వస్తువుల్ని కూడా కాపీ కొట్టారని అనడం నిజంగానే విచిత్రం. గతంలో బాహుబలి సినిమా సమయంలో కూడా అర్ధం పర్ధం లేని కంపేరిజన్స్ చేస్తూ, అసలు ఏ మాత్రం సంబంధం లేని హాలీవుడ్ మూవీ పోస్టర్లను చూపిస్తూ కాపీ కొట్టేశాడు రాజమౌళి అని కొంతమంది ప్రచారం సాగించిన సంగతి తెలిసిందే. మన డైరెక్టర్లు అసలు కాపీ కొట్టరు అని ఎవరూ అనరు. హాలీవుడ్, కొరియన్ సినిమాల్లోని చాలా సీన్లు మనోళ్లు తెచ్చి మన సినిమాల్లో పెడుతుంటారు. అంత మాత్రాన, ఇలాంటి సిల్లీ విషయాలను కూడా కాపీ అని చెప్పడం మాత్రం హాస్యాస్పదంగా అనిపించక మానదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.