English | Telugu

అభిమానికి సారీ చెప్పిన అక్షయ్ కుమార్..!

బాలీవుడ్ లో మంచి మనసున్న హీరోగా అక్షయ్ కుమార్ కు పేరుంది. హీరోగా ఎక్కువ యాక్షన్ సినిమాలే చేస్తున్నా, రియల్ లైఫ్ లో మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటాడు అక్కీ. తాజాగా అతని సింప్లిసిటీని తెలియజెప్పే ఒక సంఘటన జరిగింది. అక్షయ్ ముంబై ఎయిర్ పోర్ట్ లో వెళ్తుండగా, ఒక అభిమాని అతనితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అక్షయ్ వెనక ఉన్న బాడీగార్డ్, ఆ అభిమానిని అడ్డుకోవడమే కాక, చేయి చేసుకున్నాడు. తన వెనుక జరిగిన ఈ విషయం అక్షయ్ కు తెలీదు. తన దారిన తాను వెళ్లిపోయాడు.

ఇంటికి వెళ్లిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న అక్షయ్, ట్విట్టర్ వేదికగా ఆ అభిమానికి క్షమాపణ చెప్పాడు. బాడీగార్డ్ చేయిచేసుకోవడం తాను చూడలేదని, విషయం తెలిసిన తర్వాత అతన్ని హెచ్చరించానని, జరిగిన దానికి బాధ్యత వహిస్తూ క్షమాపణ కోరుతున్నానని అక్షయ్ అన్నారు. నిజానికి ఇంటికెళ్లిపోయిన తర్వాత, దీనిపై స్పందించాల్సిన అవసరం అక్షయ్ కు లేదు. కానీ విషయం తెలుసుకుని, పబ్లిగ్గా సారీ చెప్పడం ఒక్క అక్షయ్ కే చెల్లిందని బాలీవుడ్ పొగడ్తలు కురిపిస్తోంది. కాగా, అక్షయ్ రజనీ రోబో 2.0 లో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.