English | Telugu
వినయంగా చెప్పులు తొడుగుతున్న మహేష్ బాబు..!
Updated : Apr 7, 2016
అతనో స్టార్ హీరో. ఒక సూపర్ స్టార్ తనయుడు. కానీ అసలు ఇగో లేదు. సినిమా కోసం ఏమైనా చేస్తాడు. ఇదంతా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించే. ఆయన నటిస్తున్న బ్రహ్మాత్సవం సినిమాకు సంబంధించి ఒక సాంగ్ టీజర్ తప్ప అఫీషియల్ గా మరేమీ రిలీజ్ చేయలేదు. రేపు ఉగాది సందర్భంగా బ్రహ్మోత్సవం టీం ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో మహేష్ బాబు ఎవరికో చెప్పులు తొడుగుతున్నాడు. చాలా వినయంగా మహేష్ ఫేస్ ఎక్స్ ప్రెషన్ ఉంటే, చెప్పులు వేయించుకుంటున్న వ్యక్తిని మాత్రం కనబడకుండా బ్లర్ చేశారు. ఆ పాత్రధారి బహుశా కట్టప్ప సత్యరాజ్ కావచ్చు అనే టాక్ వినిపిస్తోంది. సినిమాలో సత్యరాజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ లాంటి స్టార్ ఇలాంటి స్టిల్ కు ఒప్పుకోవడం, ఆయన డెడికేషన్ ను సూచిస్తోందంటూ మహేష్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరుకు బ్రహ్మోత్సవాన్ని రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తోంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న ఈ సినిమాకు కేవలం రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాటి షూటింగ్ అయిపోతే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముగించుకుని ఏప్రిల్ చివరివారంలో కానీ, మే మొదటివారంలో కానీ సినిమా రిలీజయ్యే అవకాశాలున్నాయి.