English | Telugu

మదర్ తో మహేష్ బాబు

మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా కొన్ని ఫోటోలు బయటకువచ్చాయి. ఇందులో మహేష్‌బాబుకు మదర్‌గా సుకన్య నటిస్తోంది. వీళ్లిద్దరు ఇంట్లో మాట్లాడుతున్న స్టిల్స్ నెట్టింట్లో హంగామా చేస్తున్నాయి. గత సినిమాల కంటే డిఫరెంట్ లుక్‌లో మహేష్‌బాబు కనిపించాడు. అచ్చం టైటిల్ కు తగ్గట్టే చాలా సింపుల్ గా, డీసెంట్ గా కనువిందు చేస్తున్నాడు. శృతిహాసన్‌తోపాటు బెంగాళీ బ్యూటీ అంగానా రాయ్ ఇందులో నటిస్తోంది. రాజేంద్రప్రసాద్‌, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.