English | Telugu

బాలయ్యని తక్కువ అంచనా వేయొద్దు

లెజెండ్ హిట్ట‌యినా ల‌య‌న్ సినిమాకి బేరాలు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. నైజాం హ‌క్కుల్ని కొన‌డానికి ఇంత వ‌ర‌కూ ఎవ‌రూ ముందుకు రాలేద‌ట‌. అందుకే ఇప్పుడు ఈ సినిమాని చీప్ గా కొట్టేద్దాం అనుకొంటున్నాడు దిల్‌రాజు. ఈ సినిమాని తీసుకొంటారా?? అని దిల్ రాజుని అడిగితే... ''ఖర్చుల‌న్నీ మీరే చూసుకొంటానంటే రూ.3 కోట్లు ఇస్తా..'' అన్నాడట‌. బాల‌య్య సినిమా మ‌రీ అంత చీప్ గా క‌నిపిస్తుందా??? నైజాంలో లెజెండ్ రూ.7 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసింది. క‌నీసం ఆ రేటులో స‌గం కూడా ల‌య‌న్ ఖ‌రీదు చేయ‌దా?? ఎవ‌రూ కొన‌క‌పోతే... చివ‌రికి త‌న ద‌గ్గ‌ర‌కే వ‌స్తార‌ని దిల్‌రాజు మాస్ట‌ర్ ప్లాన్. అందుకే అంత త‌క్కువ‌కి అడిగిన‌ట్టున్నాడు. ఈ సినిమాని నైజాంలో ఓన్‌గా రిలీజ్ చేసుకొంటేనే బెట‌ర్ అని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. అదే జ‌రిగితే దిల్‌రాజు పాచిక పార‌న‌ట్టే.