English | Telugu
రష్మిని అంత మాట అన్నారా..?
Updated : Feb 29, 2016
గుంటూర్ టాకీస్ తో వెండితెర మీద మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది జబర్దస్త్ భామ రష్మీ గౌతమ్. తెలుగు వన్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో, తన గురించి చాలా మందికి ఉన్న డౌట్స్ కి ఆన్సర్ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో మీ డౌట్స్ కు కూడా ఆన్సర్స్ దొరుకుతాయేమో ఓ లుక్కేస్కోండి..
జనరల్ గా నేను ఫేస్ బుక్ కామెంట్స్ సీరియస్ గా తీసుకోను. కానీ ఒకే ఒక్కసారి మాత్రం బాధపడ్డాను.. అమెరికాలో షార్ట్స్, టీ షర్ట్ తో బౌలింగ్ అలీకి వెళ్లినప్పుడు ఒక ఫొటో తీసి ఫేస్ బుక్ లో పెట్టాను. నాలాంటి అమ్మాయిల వల్లే రేప్ లు జరుగుతున్నాయంటూ చాలా మంది కామెంట్స్ చేశారు. అది నన్ను బాధపెట్టింది. రేప్ అనేది డ్రస్సింగ్ లో కాదు. జనాల మైండ్ సెట్స్ లో ఉంటుంది. రేప్ అన్న పదాన్ని అంత సింపుల్ గా ఒక మనిషికి ఆపాదించడం చాలా దారుణం. అది చిన్న విషయం కాదు. అందుకే అప్పుడు నేను హర్ట్ అయి ఆ ఒక్కసారి రెస్పాండ్ అయ్యాను.
నేను తెలుగమ్మాయిని కాదు. తెలుగమ్మాయిని కాకపోయినా, ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నందుకు మీరందరూ నన్ను మెచ్చుకోవాలి. మమ్మీది ఒరిస్సా, డాడీది యూపీ. నేను మాట్లాడే తెలుగంతా, సొంతంగా నేర్చుకుని పికప్ చేసుకున్నదే..నిజానికి నాకు మీరంతా నూటికి నూటయాభై మార్కులు వేయాల్సిందే..
నా డ్రెస్సింగ్ కొంతమందికి నచ్చుతుంది. కొంత మందికి నచ్చదు. సినిమాల్లో టూ పీస్ బికీనీ వేసినా యాక్సెప్ట్ చేసే జనాలు, స్మాల్ స్క్రీన్ మీద నార్మల్ స్కర్ట్ డ్రస్సెస్ ను మాత్రం ఎందుకు రిసీవ్ చేసుకోరో నాకర్ధం కాదు. జబర్దస్ట్ చూసే వారిలో అన్ని రకాల ఆడియన్స్ ఉంటారు. అందుకే లంగా ఓణీల నుంచి స్కర్ట్స్ వరకూ అన్ని రకాల డ్రస్సెస్ వేయాల్సి వస్తుంది. అయినా నేను వేసే డ్రస్సెస్ బయటి అమ్మాయిలు కూడా వేసుకుంటారు కదా. ఇంకా చెప్పాలంటే, బయటే ఇలాంటి డ్రస్సెస్ లో అమ్మాయిలు ఎక్కువ కనిపిస్తున్నారు.
సినిమాలో నేను చాలా హాట్ గా చేశానంటున్నారు. హాట్ గా చేయకుండా, పైకొచ్చిన హీరోయిన్ ఒక్కరైనా ఉన్నారా..? ముందో వెనుకో, ఎప్పుడైనా హాట్ గా కనిపించాల్సిందే.
గుంటూర్ టాకీస్ రిలీజైన తర్వాత నాకు ఐటెమ్ సాంగ్ చేయమని కనీసం 15 కాల్స్ అయినా వస్తాయి (నవ్వుతూ). ఐటెం సాంగ్స్ చేయడానికి నేనేమీ వ్యతిరేకం కూడా కాదు. పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేస్తున్నప్పుడు నేనెందుకు చేయను..
నేను ఏ మీడియంలోనైనా యాక్ట్ చేయడానికి రెడీ. అది బిగ్ స్క్రీన్ కావచ్చు. టీవీ కావచ్చు. ఇంటర్నెట్ మీడియం కావచ్చు. కేమేరా ముందు ఉండటం అనేది నాకు ఇష్టం. కేమేరా నా ముందు ఉండటం అనేది నా అదృష్టంగా నేను ఫీల్ అవుతాను. ఐ డోంట్ కేర్ విచ్ మీడియం ఇట్ ఈజ్. రేపు ఎవరో వచ్చి, యూట్యూబ్ లో సినిమా చేసి పెట్టాలి అంటూ మంచి సినిమా వస్తే, అది కూడా చేస్తాను.
గుంటూర్ టాకీస్ చేస్తున్నప్పుడు, కారవాన్ కావాలంటూ నేను ప్రొడ్యూసర్ ను ఇబ్బంది పెట్టానంటూ రూమర్స్ వచ్చాయి. కానీ అవేమీ నిజం కాదు. ఎక్కడో స్లమ్ ఏరియాస్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు జస్ట్ బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయి. లేడీస్ ఓపెన్ గా ప్రాబ్లెమ్ ను చెప్పలేం కదా. డ్రెస్ ఛేంజ్ లాంటివి ఎక్కడ చేసుకోవాలి..? స్టార్ హీరోయిన్ కాకపోయినా, బేసిక్ నీడ్స్ మాత్రం తప్పదు. అయినా, ప్రొడ్యూసర్ ను డిమాండ్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు. అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ రూమర్ ఎలా వచ్చిందో తెలియదు. నేనైతే ఎప్పుడూ డిమాండ్ చేయలేదు.
సినిమాలో నా క్యారెక్టర్ సువర్ణ నాకు పూర్తి తృప్తినివ్వలేదు. డైరెక్టర్ గుంటూర్ టాకీస్ పార్ట్ 2 తీస్తానన్నారు. బహుశా అది కూడా పూర్తయ్యాక హ్యాపీ అవుతానేమో (నవ్వుతూ). ఏ యాక్టర్ కూడా వాళ్ల క్యారెక్టర్ పట్ల పూర్తిగా శాటిస్ ఫై అవలేరు. ఇంకొంచెం బెటర్ గా చేసి ఉండచ్చు కదా ఫీలింగ్ కంపల్సరీ ఉంటుంది.
జబర్దస్త్ కంటెస్టెంట్స్ అందరితోనూ నాకు లింకప్స్ పెట్టి రూమర్స్ తెస్తుంటారు. ఒకసారి సుధీర్ అన్నారు. మరో సారి చంటి అన్నారు. మొన్నామధ్య రష్మీకి ఎవరో బిజినెస్ మ్యాన్ తో పెళ్లయిపోయింది అని రాశారు. ఇలాంటి వన్నీ ఎందుకొస్తాయో నాకు అర్ధం కాదు. కానీ నా గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే, నాకు వేల్యూ పెరిగినట్టే కదా అని లైట్ తీసుకుంటాను. అయినా నేనొక యంగ్ గర్ల్ ను. నా గురించి కాకపోతే, పెళ్లైపోయిన వాళ్ల గురించి రూమర్స్ రావు కదా..