English | Telugu
మహేష్ ట్రాక్ తప్పుతున్నాడా?
Updated : Oct 4, 2014
ఆగడు ఫ్లాప్ నుంచి ఇంకా కోలుకోలేదు... మహేష్ ఫ్యాన్స్. ఇప్పుడు వాళ్లందరికీ మరో షాక్ తగిలింది. అదీ.... వి.వి.వినాయక్ రూపంలో. మహేష్‌బాబు -వివివినాయక్ కాంబినేషన్ అనగానే అందరికంటే ఎక్కువగా షాక్ తిన్నది మహేష్ ఫ్యాన్సే. అసలు ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా?? ఇద్దరికీ కెమిస్ట్రీ కుదురుతుందా? అనేది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వినాయక్‌ది ఫుల్‌లెంగ్త్ యాక్షన్ మూడ్. ఆయన సినిమాల్లో హీరో.. మాస్‌కి నిలువెత్తు కటౌట్‌లా ఉంటాడు. మహేష్ కూడా మాస్ పాత్రలు చేశాడు గానీ, మరీ అంత మాసీ ఫేస్ కాదు. శ్రీనువైట్ల, పూరి, త్రివిక్రమ్ శైలిలకు మహేష్ అతికినట్టు సరిపోతాడు. కానీ వినాయక్ ఫ్రేమ్‌లో మహేష్‌ని ఊహించడం చాలా కష్టం. అలాంటప్పుడు మహేష్ వినాయక్‌ని ఎలా ఎంచుకొన్నాడో ఎవ్వరికీ అర్థం కావడంలేదు. `1` సినిమాతో ప్రయోగాలు చేయడకూడదనే పాఠం నేర్చుకొన్న మహేష్..... ఆ టైపు కథల్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు.
అయితే తాను నమ్ముకొన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఆగడు సినిమాని కాపాడలేకపోయాయి. అందుకే మహేష్‌లో ఇప్పుడు కొత్త కన్‌ఫ్యూజన్ మొదలైంది. ఎలాంటి కథలు ఎంచుకోవాలో, ఏ దారిలో నడవాలో తెలియక మహేష్ చాలా ఇబ్బంది పడుతున్నాడని, ఈ కన్‌ఫ్యూజన్‌లోనే వినాయక్ కథకీ ఒకే చెప్పేసుంటాడని టాక్. కథల్ని, పాత్రల్ని కాకుండా దర్శకుడికి ఉన్న స్టార్ వాల్యూని మహేష్ నమ్ముతున్నాడా అనే అనుమానం వేస్తోంది. అసలు మహేష్ మనసులో ఏముందో, తనకే తెలియాలి. నిజానికి మహేష్ - వినాయక్‌ల కాంబినేషన్ సెట్టవుతుందన్న నమ్మకాలూ ఎవ్వరికీ లేవు. ఎందుకంటే మహేష్ కొరటాల శివ సినిమా పూర్తి చేయాలి. ఆ తరవాత పూరి, త్రివిక్రమ్‌ల సినిమాలు మొదలువుతాయి. మరోవైపు లింగుస్వామి కూడా మహేష్ కోసం క్యూలో ఉన్నాడు. వీళ్లందరి సినిమాలూ పూర్తి చేసేటప్పటికి ఎన్నేళ్లు పడుతుందో? అప్పటికి ఎన్ని లెక్కలు మారతాయో...? అందుకే వినాయక్ సినిమా ఉండే ఛాన్స్ లేదని, ఇది ఉత్తుత్తి కాంబినేషన్ అని కొంతమంది మహేష్ ఫ్యాన్సే వ్యాఖ్యానిస్తున్నారు. మరి వారి మాటే నిజమవుతుందంటారా??