English | Telugu
సినీపరిశ్రమలో ఆకస్మిక మరణాలపై హోమం
Updated : Mar 14, 2015
గత కొంతకాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలపై తెలుగు సినీ పెద్దలు ఉలిక్కిపడ్డారు. దీనిని చాలా సీరియస్ గా పరిగణించడంతో పాటు వెంటనే పరిహార చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అందుకోసం పెద్దలంతా చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇది కచ్చితంగా ఏదో దోషమే అని తేల్చి దానికి పరిహరించుకోవడానికి హోమం చేయాలని నిశ్చయించారు. వేద పండితుల సలహాతో చివరకు “పాశుపత మహా మృత్యుంజయ హోమం” చేయడానికి సిద్ధమయ్యారు. దీనిని స్వయంగా శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కీడు తొలగకపోతే ఇంకా ఇలాంటి దుర్వార్తలు వినాల్సి వస్తుందని ఈనెలలోనే హోమం చేయాలని నిర్ణయించి దానికి మార్చి 23, 24, 25 తేదీలను సమయంగా నిర్ణయించారు. ఈ విషయాన్ని స్వయంగా తెలుగు నటుడు, ఎంపీ మురళీమనోహర్ ప్రకటించారు.