English | Telugu
‘లవ్ చెయ్యాలా... వద్దా...’ ఫస్ట్ లుక్
Updated : Jan 19, 2016
ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ ఫేమ్ కార్తీక్, శ్వేతావర్మ హీరో హీరోయిన్లుగా జి.కె.సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘లవ్ చెయ్యాలా...వద్దా...’. ఎస్.నౌషద్ దర్శకత్వంలో జి.వి.రమణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం వైజాగ్ లో జరిగింది. సోగ్గాడే చిన్నినాయనా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. కార్తీక్, శ్వేతావర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో మ్యూజిక్ః గౌతమ్ ధ్యాని, కెమెరాః ప్రవీణ్, ఎడిటింగ్ః ఉద్ధవ్, నిర్మాతః జి.వి.రమణ, దర్శకత్వం: ఎస్.నౌషద్.