English | Telugu
నాన్నని చూసి నేర్చుకోండయ్యా...!
Updated : Jan 19, 2016
నాగ్‌ని టాలీవుడ్ మన్మథుడు అని ఎందుకంటారో.. సోగ్గాడే చిన్నినాయన చూస్తే మరోసారి అర్థమైపోతుంది. ఈ వయసులోనూ... ఆ గ్లామర్ చెక్కు చెదరలేదు. మరీ ముఖ్యంగా పంచె కట్టుకొని నడిచొస్తుంటే.. ఫ్యాన్సు విజిల్సే విజిల్సు. మరో పదేళ్లయినా అదే హుషారు కనిపిస్తుందే అన్నంత భరోసా వచ్చేసింది. ఆ ఎనర్జీ చూసి ఫ్యాన్సంతా మురిసిపోతున్నారు. బంగార్రాజు విన్యాసాలు చూసి తరించిపోతున్నారు. ''మరి అబ్బాయిలు ఎప్పుడు షైన్ అవుతారో..'' అనిపిస్తోంది కూడా. అవును మరి.. నాగచైతన్య ఇండ్రస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదేళ్లయిపోతోంది. ఇప్పటి వరకూ నాన్నలా ఎనర్జీ చూపించలేకపోయాడు.
ఒక్క ఫ్రేములోనూ ఈజ్‌తో నటించలేకపోయాడు. ఎప్పుడూ మూడీగా ఉంటాడో, లేదంటే అలాంటి పాత్రలే వస్తాయో తెలీదు గానీ... చైతూని జోష్‌లో చూడలేకపోయాం. అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కూడా అంతే. డాన్సులు జోరుగా వేశాడు గానీ.. సన్నివేశాల దగ్గరకు వచ్చేసరికి డల్ అయిపోయాడు. కొన్నిసార్లు ఫేస్ బ్లాంకుగా పెట్టి.. కెమెరా వంక క్వశ్చన్ మార్కు ఫేసు పెట్టి చూశాడు. దాంతో నాగ్ అభిమానులు కంగారు పడ్డారు. ''చైతూ బెటరేమో..'' అనేసుకొన్నారు. ఇప్పుడు వీరిద్దరూ... సోగ్గాడే చిన్నినాయిన మళ్లీ మళ్లీ చూడాలి. నాన్నలో... ఈ వయసులోనూ అంత ఈజ్ ఎలా వచ్చిందో ఆరా తీయాలి... ఆ రహస్యాన్నిఛేందించాలి. అప్పుడే తండ్రికి తగ్గ తనయులు అనిపించుకొనే ఛాన్స్ దక్కుతుంది.