English | Telugu

హీరోయిన్ల జీవితాల‌తో ఆడుకొంటున్నాడు

ఎప్పుడూ ఎవ‌రినో ఒక‌రిని కెల‌కందే వ‌ర్మ‌కి నిద్ర‌ప‌ట్ట‌దు. ఈమ‌ధ్య సినిమాలు తీయ‌డం కంటే ట్విట్ట‌ర్లలో వెర్రి కూత‌లు కూయ‌డానికే టైమ్ అంతా కేటాయించాడు. మ‌ధ్య‌లో గ్యాప్ వ‌స్తే... ఓ పుస్త‌కం కూడా రాసేశాడు. గ‌న్స్ అండ్ థైస్ పేరుతో ఈ పుస్త‌కం విడుద‌ల కానుంది. తుపాకుల‌తో, తొడ‌ల‌తో త‌న‌కున్న సంబంధ బంధ‌వ్యాల‌ను వ‌ర్మ త‌న‌దైన స్టైల్లో రాసుకొచ్చాడ‌ట‌.

గ‌న్స్ అంటే అండ‌ర్ వ‌రల్డ్ మాఫియా అని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లెద్దు. ఇక తొడ‌లు గురించి అంటే.. క‌థానాయిక‌ల‌తో త‌న‌కున్న అక్ర‌మ సంబంధాలే అన్న‌ది సుస్ప‌ష్టం. ఈ పుస్త‌కంలో కొంత‌మంది హీరోయిన్ల గురించి ప్ర‌స్తావించాడ‌ట వ‌ర్మ‌. హీరోయిన్ల శృంగార ప‌ర‌మైన విషయాల్ని సిగ్గు లేకుండా రాసుకొచ్చాడ‌ట‌. అవి బ‌య‌ట‌కు వ‌స్తే.. త‌మ ప‌రువు ఏమైపోతుందో అని కంగారు ప‌డుతున్నారు.. వ‌ర్మ‌తో స‌న్నిహితంగా మెలిగిన కొంత‌మంది క‌థానాయిక‌లు. అప్పుడే వ‌ర్మ‌కు హీరోయిన్లు ఫోన్లు చేసి `మ‌న వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు చేయొద్దు ప్లీజ్‌` అంటూ వేడుకొంటున్నాట‌.

కొంత‌మంది క‌థానాయిక‌ల‌కు పెళ్లిళ్ల‌యిపోయి, సుఖంగా వైవాహిక జీవితం గ‌డ‌పుతున్నారు. అలాంటివాళ్ల ప్ర‌స్తావ‌న కూడా ఈ పుస్త‌కంలో ఉంద‌ట‌. మొత్తానికి త‌న పుస్తకాన్ని అమ్ముకోవ‌డానికి, త‌న‌కు మ‌రికొంత ప‌బ్లిసిటీ రావ‌డానికి క‌థానాయిక‌ల జీవితాల‌తో ఆడుకోవ‌డం మొద‌లెట్టాడు వ‌ర్మ‌. అండ‌ర్ వ‌ర‌ల్డ్ వల్ల త‌న‌కెలాంటి ముప్పూ లేదు. ఎందుకంటే వాళ్ల‌ని కెలికే ప‌ని వ‌ర్మ ఎప్ప‌టికీ చేయ‌డు. ఇక మిగిలింది క‌థానాయిక‌ల గురించే. అందుకే.. త‌న వెర్రిరాత‌ల‌తో వాళ్ల‌ని బ‌లి చేద్దామ‌ని డిసైడ్ అయ్యాడేమో.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .