English | Telugu

ఆయ‌న్ని అనుష్కనే ఆదుకోవాలి

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా కృష్ణ‌వంశీకి బోల్డు పేరుంది. కానీ లేనిద‌ల్లా క‌మ‌ర్షియ‌ల్ హిట్టే. చంద‌మామ త‌ర‌వాత నికార్స‌యిన విజయం చ‌వి చూళ్లేదు క్రిష్ణ‌వంశీ. గోవిందుడు అంద‌రివాడేలే..తో ట్రాక్ ఎక్క‌డానుకొన్నారు. కానీ ఏం లాభం..?? ఆ సినిమా సైతం నిర్మాత‌కు న‌ష్టాల్ని మిగిల్చింది. ఇప్పుడు ఎప్ప‌ట్లా.. త‌న మార్క్ చూపించాల‌న్న ఉద్దేశంతో లేడీ ఓరియెంటెడ్ నేప‌థ్యంలో ఓ చిన్న సినిమా ప్లాన్ చేసి దిల్‌రాజు ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఆయ‌నేమో.. ''చిన్న సినిమాగా ఏం తీస్తాం. పెద్ద హీరోయిన్‌ని వెదికి ప‌ట్టుకొని.. భారీగా చేద్దాం'' అన్నాడు.

గ‌త యేడాది నుంచి ఈ సినిమాలో హీరోయిన్ కోసం తెగ వెదుకుతున్నాడు కృష్ణ‌వంశీ. ఇప్పుడు ఆయ‌న‌కు అనుష్క ఓ దేవ‌తలా క‌నిపిస్తోంది. ఈ సినిమాని నేమూ, ఫేమూ, మార్కెట్లూ ఉన్న అనుష్క‌తో లాగిస్తే.. నాలుగు డ‌బ్బులొస్తాయ‌న్న‌ది కృష్ణ‌వంశీ ఆలోచ‌న‌. అనుష్క య‌స్‌.. అంటే.. ఈ సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి దిల్‌రాజు కూడా రెడీగానే ఉన్నాడు. మ‌రి అనుష్క ఓకే అంటుందో, లేదో... అన్న సందేహం నెల‌కొంది. వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. అనుష్కకు బోర్ కొట్టేసింద‌ట‌.

కొంత‌కాలం ఇలాంటి సినిమాల‌కు దూరంగా ఉండాల‌నుకొంటోంది. దానికి తోడు కృష్ణ‌వంశీకీ స‌రైన విజయాల్లేవు. ఈ ద‌శ‌లో రిస్క్ తీసుకోవ‌డం ఎందుకూ.. అని జేజ‌మ్మ అనుకొంటే.. కృష్ణ‌వంశీకి గ‌డ్డుకాల‌మే. అదే.. గుణ‌శేఖ‌ర్‌ని ఆదుకొన్న‌ట్టు.. కృష్ణ‌వంశీనీ ఆదుకొంటే ఏమ‌వుతుందిలే అని ఉదార‌త చూపిస్తే.. ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయం. ఇప్పుడు కృష్ణ‌వంశీ ఫ్యూచ‌ర్ కాస్త‌.. అనుష్క చేతుల్లోకి వెళ్లింద‌న్న‌మాట‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.