English | Telugu

ర‌కుల్ ఫ్యూచ‌ర్‌.. ఎన్టీఆర్ చేతుల్లో

ర‌కుల్ ప్రీత్ సింగ్ ప‌రిస్థితి ఇప్పుడు అగ‌మ్య గోచ‌రంగా ఉంది. చేతిలో సినిమాలున్నా.. హిట్ లు లేక‌పోవ‌డంతో.. ఈ ల‌క్కీగాళ్‌కి ఐరెన్ లెగ్ అనే ముద్ర త‌ప్ప‌డం లేదు. ఒక్క‌సారిగా స్టార్ హీరోయిన్ గా మారి, బ‌డా క‌థానాయిక‌ల‌కు సైతం చ‌మ‌ట్లు ప‌ట్టించింది ర‌కుల్‌. స‌మంత‌, కాజ‌ల్‌, త‌మ‌న్నా.. వీళ్లంతా ర‌కుల్ దెబ్బ‌కు త‌ట్టా బుట్టా స‌ర్దేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే ర‌కుల్ ప‌రిస్థితి ఇప్పుడు రివ‌ర్స్ అయ్యింది. వ‌రుస‌గా.. ఫ్లాప్స్ త‌గ‌ల‌డంతో.. ర‌కుల్ కెరీర్‌లో కుదుపులు మొద‌లయ్యాయి.

ఇన్ని సినిమాలు చేసినా.. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, లౌక్యం సినిమాలు మాత్ర‌మే హిట్స్ జాబితాలో చేరాయి. క‌రెంటు తీగ ఓ మాదిరిగా ఆడిందంతే. కిక్ 2, బ్రూస్లీ, పండ‌గ చేస్కో ఢ‌మాల్ అన్నాయి. ఈ సినిమాల ద్వారా ర‌కుల్ త‌న గ్లామ‌ర్‌ని వీలైనంత వ‌ర‌కూ.. ప్ర‌దర్శించినా.. ఫ‌లితం లేకుండా పోయింది. ర‌కుల్ చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆశా దీపం... నాన్న‌కు ప్రేమ‌తో. ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కాబోతోంది. ఎన్టీఆర్ సినిమాతో హిట్టు కొట్టి త‌న‌ని తాను నిరూపించుకోవాల‌నుకొంటోంది ర‌కుల్‌.

అయితే.. ఓ సెంటిమెంట్ ర‌కుల్‌ని భ‌యంక‌రంగా భ‌య‌పెడుతోంది. అదేంటంటే.. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన‌వాళ్లెవ్వ‌రూ అంత‌గా క్లిక్క‌వ్వ‌లేదు. ఒక్క త‌మ‌న్నాని మిన‌హాయిస్తే.. సుక్కు సినిమా త‌ర‌వాత వాళ్ల‌కు కెరీరే లేకుండా పోయింది. ఇప్పుడు నా ప‌రిస్థితీ ఇంతేనా.... అంటూ ర‌కుల్ కంగారు ప‌డిపోతోంది. ఈ సినిమాని హిట్ చేసి... న‌న్ను కాపాడు అంటూ భ‌గ‌వంతుడ్ని కోరుకొంటోంద‌ట ర‌కుల్‌. మ‌రి... ర‌కుల్ ఫేట్‌ని ఎన్టీఆర్ అయినా మారుస్తాడో లేదో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .