English | Telugu
ప్రీతీ జింతా సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుంది..!
Updated : Mar 1, 2016
చాలా కాలంగా బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింతా మ్యారేజ్ గురించి న్యూస్ లు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా సార్లు బాలీవుడ్ మీడియా ఆమెకు పెళ్లి చేసేసింది. అంతకు ముందు నెస్ వాడియాతో యవ్వారం నడిపి బోల్తా కొట్టిన ప్రీతీ పాప ఈ సారి మాత్రం గురి తప్పలేదు. అమెరికా కు చెందిన ఫైనాన్షియల్ అనలిస్ట్ జీనే గుడ్ ఎనఫ్ తో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న ఈ భామ ఎట్టకేలకు పెళ్లిచేసుకుంది. నటుడు కబీర్ బేడీ తన ట్విట్టర్లో లాస్ ఏంజిల్స్ లో పెళ్లి చేసుకున్న ప్రీతికి కంగ్రాట్స్ అని ట్వీట్ పెట్టి వార్తల్ని కన్ఫామ్ చేశాడు. సుస్మితా సేన్ కూడా కంగ్రాట్స్ చెప్పడంతో, బాలీవుడ్ జనాలు ప్రీతికి పెళ్లయిందని డిసైడ్ చేసుకున్నారు. గత నెల 28 న చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ప్రీతి జీనేల పెళ్లి జరిగిందని సమాచారం.