English | Telugu
లావణ్య త్రిపాఠికి మరో లక్కీ ఛాన్స్!
Updated : Feb 26, 2016
‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి హీరో నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’, అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రాలు భారీ విజయాన్ని సాధించడంతో ఒక్కసారిగా లావణ్య త్రిపాఠి పేరు టాలీవుడ్ లో మార్మోగుతుంది. ప్రస్తుతం అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’, సందీప్ కిషన్ భారీ బడ్జెట్ సినిమా ‘మాయావన్’ తదితర సినిమాలతో బిజీ బిజీగా వున్న లావణ్య త్రిపాఠికి మరో లక్కీ ఛాన్స్ వచ్చింది.
అదేమిటంటే... మెగా కాంపౌండ్ నుంచి రీసెంట్ వచ్చి తన నటనతో మెగా అభిమానులనే కాకుండా ప్రేక్షలను సైతం తన నటతో ఆకర్షిస్తున్న వరుణ్ తేజ్ హీరోగా అతి తర్వలో ‘ఆగడు’, ‘బ్రూస్ లీ’ లాంటి రెండు భారీ పరాజయాలను అందించిన శ్రీను వైట్ల ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ లావణ్య త్రిపాఠికి వచ్చినట్లు సమాచారం.