English | Telugu
ఒకేరోజు తొమ్మిది సినిమాలు.. ఎన్ని హిట్.. ఎన్ని ఫట్..
Updated : Feb 26, 2016
ఒకప్పుడు సినిమా రిలీజ్ చేయాలంటే కాస్త వెనుకా ముందు చూసుకొని.. తమ సినిమాకి ఎలాంటి కాంపిటీషన్ లేకుండా చూసుకుంటూ విడుదల చేసేవాళ్లు.. అది ఒకప్పటి రోజులు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. మంచిరోజైతే చాలు తమకు పోటీ వస్తున్నా తమ సినిమాలు రీలీజ్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సినిమా విడుదలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చిన్న సినిమాలకు. ఎలాగూ సమ్మర్ వస్తుంది కాబట్టి పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇంక వాటి దాటికి ఈ చిన్న సినిమాలు తట్టుకోవడం కష్టం. ఇక పెద్ద సినిమాలకు ఎలాగూ థియేటర్లు దొరకడం ఈజీనే. చిన్న సినిమాలకే ఇప్పట్లో మళ్లీ థియేటర్లు దొరికే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో ఉన్న రోజులనే వాడుకోవాని చూస్తున్నాయి. అందుకే.. ఈరోజు ఏకంగా తొమ్మిది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ తొమ్మిది సినిమాల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయి.. వాటిలో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయి.. ఎన్ని సినిమాలు ఫట్ అవుతాయో తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.
* క్షణం
* పడేసావే
* టెర్రర్
* అప్పుడలా ఇప్పుడిలా
* వీరివీరి గుమ్మడిపండు
* ఎలుకా మజాకా
* యమపాశం
* రాజుగారింట్లో 7వ రోజు
* God of Egypt