English | Telugu
పెళ్లి చేసుకుని దొంగతనం చేసిన హీరోయిన్
Updated : Feb 26, 2016
రాజ రాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై హరిని దర్శకుని గా పరిచయం చేస్తూ జ్యోతి రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ హీరోగా నిర్మాత రాజ రాజేశ్వరి శ్రీనివాస రెడ్డి నిర్మించిన చిత్రం "లక్కీ". ఈ చిత్రంలో శ్రీకాంత్ కి జోడీగా అందాల హాట్ బ్యూటీ మేఘనారాజ్ నటించింది. కాగా మేఘన ఇప్పుడు చిత్రమైన వివాదంలో ఇరుక్కుని మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ హాట్ టాపిక్ ఏమిటంటే... తమిళనాడుకు చెందిన జనార్దన్ అనే వ్యాపారవేత్త తనను మేఘన పెళ్లాడి మోసగించిందంటూ పోలీసుకులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదు గురించి బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ లోకేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... సరైన సాక్ష్యాలు చూపకపోవడంతో మేఘన రాజ్ ఇచ్చిన కేసును మూసేసినట్లు వెల్లడించారు. జనార్దన్ మాత్రం మేఘనారాజ్ తనను పెళ్లాడి మోసగించడంతో పాటు వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా దొంగలించి సాక్ష్యాలు లేకుండా చేసిందంటూ మరో కంప్లైంట్ చేసాడు.