English | Telugu

జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత.. ఏం తేల్చారంటే..?

రెంటెడ్ విధానాన్ని తీసేసి, షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాతల నుంచి సానుకూల స్పందన రాకపోతే.. జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని ప్రకటించారు.

నేడు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఎగ్జిబిటర్స్ సమస్యలపై చర్చలు జరిగాయి. ఇందులో పలువురు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు. మెజారిటీ సభ్యులు.. సమ్మె వద్దు, థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని తెలిపారు.

గతంలో క్యూబ్ సమస్యలపై థియేటర్లు మూసివేత, ఆర్టిస్టుల రెమ్యునరేషన్లపై షూటింగుల నిలిపివేత.. ఈ రెండు విషయాల్లోనూ సత్ఫలితాలు రాకపోవడంతో, ఈ సారి థియేటర్లు మూతపడకుండా, సినిమాలు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే పైరసీ, ఐపీఎల్, ఓటీటీ రూపంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా తగ్గింది. మే 30 నుంచి వరుస సినిమాలు ఉండటంతో మరింత ఇబ్బంది అవుతుంది కాబట్టి, థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకుని తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించాలని ఎగ్జిబిటర్లను కోరారు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు. దీంతో జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా పడింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.